ఐఎన్‌ఎస్ విశాఖ యుద్ధనౌకను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆదివారం జాతికి అంకింతం చేశారు. దేశీయంగా నిర్మించిన ఈ ఐఎన్‌ఎస్ విశాఖ యుద్దనౌక పశ్చిమ నౌకాదళంలో సేవలందించనుంది. అయితే ముంబైలోని నౌకాదళ డాక్‌యార్డ్‌లో భారత నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్ (INS)విశాఖపట్నంను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. మన అవసరాల కోసం మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అవసరాల కోసం కూడా భారత్ నౌకలను నిర్మిస్తుందనడంలో సందేహం లేదని అన్నారు. భారతదేశం ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని నియమాల ఆధారంగా, నావిగేషన్…