సిద్దిపేట జిల్లాలో అప్పుడే పుట్టిన శిశు విక్రయం కలకలం రేపుతుంది. సిద్దిపేట అర్బన్ (మం) బూర్గుపల్లి గ్రామ శివారులో నిన్న ఉదయం పుట్టిన పసికందును 20 వేలకు విక్రయించే ప్రయత్నం చేసారు తల్లిదండ్రులు. గజ్వేల్ కి చెందిన ఓ కుటుంబంతో విక్రయ ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం తెలుస్తోంది. విషయం తెలుసుకున్న బాల రక్షక్ అధికారులు శిశు విక్రయాన్ని అడ్డుకున్నారు.