Indus Water treaty: పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఉపసంహరించుకునే వరకు భారతదేశం ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలుపుదలలో ఉంచుతుందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మంగళవారం చెప్పారు. ఆపరేషన్ సిందూర్, భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని రోజుల తర్వాత విదేశాంగ శాఖ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.