IndiGo Flight: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రయాణిస్తున్న విమానాన్ని దారి మళ్లించారు. సీఎంఓ అందించిన సమాచారం ప్రకారం.. ఇండిగో విమానం దిబ్రుగఢ్ నుంచి గౌహతికి వెళుతోంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని అగర్తలాకు మళ్లించారు. దీంతో కొంత సేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం విమానంలో ఉన్న వారందరూ సురక్షితంగా ఉన్నారని చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.