IndiGo Flight: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రయాణిస్తున్న విమానాన్ని దారి మళ్లించారు. సీఎంఓ అందించిన సమాచారం ప్రకారం.. ఇండిగో విమానం దిబ్రుగఢ్ నుంచి గౌహతికి వెళుతోంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని అగర్తలాకు మళ్లించారు. దీంతో కొంత సేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం విమానంలో ఉన్న వారందరూ సురక్షితంగా ఉన్నారని చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
READ MORE: Heroines : లవ్ బ్రేకప్స్ వల్ల బాగుపడ్డ హీరోయిన్స్ ఎవరంటే?
సరిగ్గా నాలుగు రోజుల కిందట అస్సాంలో ఓ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గౌహతి-కోల్‌కతా మార్గంలో నడుస్తున్న అలయన్స్ ఎయిర్ విమానం 9I756 బుధవారం గగనతలంలో సాంకేతిక సమస్యను ఎదుర్కొంది. ఫలితంగా విమానాన్ని గౌహతిలో ల్యాండ్ చేశారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ప్రామాణిక భద్రతా ప్రోటోకాల్‌లను పాటించి, విమానం గౌహతి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ సమాచారాన్ని అలయన్స్ ఎయిర్ అధికారిక ప్రకటనలో తెలిపింది.
మరోవైపు.. ఈ రోజు శంషాబాద్-తిరుపతి అలియాన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక లోపం చోటుచేసుకుంది. విమానం మూడు సార్లు రన్‌వే పైకి వెళ్లి తిరిగి వచ్చింది. విమానం టేకాఫ్ తర్వాత పైలెట్ సాంకేతిక లోపం గుర్తించారు. దీంతో వెంటనే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అలియాన్స్ విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నిలిచిపోయింది. ఆ విమానంలో 37 మంది ప్రయాణికులు తిరుపతి వెళ్లాల్సి ఉంది. మూడు సార్లు రన్‌వే పైకి వచ్చి తిరిగి వెనక్కి వెళ్లిన విమానం పట్ల విసుకు చెందిన ప్రయాణికులు అందోళన వ్యక్తం చేశారు. ఐదు రోజుల క్రితం కూడా అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. తిరుపతి వెళ్లాల్సిన 67 మంది ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పడిగాపులు కాశారు. ఆరోజు పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.