అమెరికా ఫెడరల్ రిజర్వ్ గురువారం వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించింది. 2024లో వడ్డీ రేట్లు తగ్గించడం ఇది రెండోసారి. ద్రవ్యోల్బణం ఇప్పుడు నియంత్రణలోకి వస్తుందని ఫెడ్ అభిప్రాయపడింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై 48 గంటలు కూడా గడవని తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.