Azerbaijan: ఇకప్పుడు సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్న ఆర్మేనియా, అజర్‌బైజాన్ చిరకాల ప్రత్యర్థులుగా మారాయి. ఈ రెండు దేశాల మధ్య పరిస్థితి ఇప్పటికీ ఉద్రిక్తంగానే ఉంది. నగోర్నో-కరబాఖ్ ప్రాంతం మీద ఆధిపత్యం కోసం గడచిన మూడు దశాబ్దాలుగా ఈ రెండు దేశాల మధ్య చెదురుమదురు సంఘర్షణలు జరుగుతూనే వచ్చాయి.