ఒలింపిక్స్ లో భారత్ చరిత్ర ఎప్పుడూ తీసికట్టే. మనతో ఎందులోనూ సరితూగని దేశాలు కూడా విశ్వ క్రీడా వేదికపై తలెత్తుకుని సగర్వంగా నిలబడుతుంటే.. ఇండియా మాత్రం పతకాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడాల్సిన దుస్థితి. అడపాదడపా సాధించే విజయాలను అపురూపంగా కళ్లకద్దుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు టోక్యోలో కూడా మహిళలే భారత్ పరువు నిలబెట్టారు. టోక్యో ఒలింపిక్స్ తొలిరోజే వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను రజతం గెల్చింది. దేశ చరిత్రలో ఒలింపిక్స్ తొలిరోజే పతకం రావడం…