ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. ఆదివారం భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ఈ ఆసక్తికర పోరు కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అటు.. క్రికెట్ అభిమానులతో పాటు, మాజీ క్రికెట్ దిగ్గజాలు, ప్రముఖులు, సెలబ్రిటీలు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన అభిప్రాయాన్ని తెలిపారు. ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్తాన్‌పై భారత్ అద్భుతమైన రికార్డును కొనసాగిస్తుందని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు.