జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు పునరాగమనం చేసింది. రెండో మ్యాచ్‌లో టీమిండియా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పుడు మూడో మ్యాచ్‌లో భారత్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. జింబాబ్వే ఎదుట 183 పరుగులు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్(66), రుతురాజ్(49)లు రాణించారు.