Income Tax Returns: 2021-22 ఆర్ధిక సంవత్సరానికి ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే ఆఖరు తేదీ ముగిసిపోయింది. జూలై 31లోగా రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంది. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసి ఇ-వెరిఫై పూర్తి చేయలేదా.. అయితే వెంటనే ఆ పని పూర్తి పనిచేయండి. ఆగస్టు 1 నుంచి ఈ గడువును 30 రోజులకు తగ్గిస్తూ ఆదాయపు పన్ను విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటివరకు ఈ గడువు 120 రోజులు ఉండేది. సాధారణంగా ఆధార్…
IT Returns Filing: 2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే గడువు ఉంది. ఆదివారంతో ఐటీ రిటర్న్స్ దాఖలు సమయం ముగియనుంది. శుక్రవారం వరకు దేశవ్యాప్తంగా 4.52 కోట్ల మందికి పైగా ఐటీఆర్ దాఖలు చేశారని ఇంకమ్ ట్యాక్స్ విభాగం ప్రకటించింది. శుక్రవారం ఒక్కరోజే 43 లక్షలకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయని తెలిపింది. ఐటీఆర్ గడువు పెంచుతారని చాలా మంది ఆశలు పెట్టుకోగా.. ప్రస్తుతానికి ఐటీఆర్ దాఖలు…
rajinikanth is highest tax payer in tamilnadu: ప్రముఖ తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 50 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. బాషాగా, ముత్తుగా, అరుణాచలంగా, నరసింహగా, శివాజీగా, రోబోగా .. ఎన్నో రకాలుగా అలరించిన రజనీకాంత్ అంటే తెలియని సినిమా ప్రేక్షకుడు ఉండడు. అవార్డులు, రివార్డులు ఆయనకేం కొత్త కాదు. కాకపోతే తమిళనాడు ప్రభుత్వం కొత్తగా ఆయనకు ఓ అవార్డును ప్రకటించింది. తమిళనాడు రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం పన్ను…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోన్న సమయంలో అనూహ్యంగా డోలో 650 టాబెట్ల అమ్మకాలు పెరిగిపోయాయి.. ప్రపంచ వ్యాప్తంగా డోలో పేరు మార్మోగిపోయింది.. డోలో 650 వేసుకుంటే చాలు.. కరోనా నుంచి తప్పించుకోవచ్చన ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆ మాత్రలను కొనుగోలు చేశారు.. భారత్‌లోనే కాదు.. విదేశాల్లోనూ డోలోకు డిమాండ్ పెరిగింది.. మైక్రో ల్యాబ్స్ నుంచి పెద్ద ఎత్తున విదేశాలకు సైతం తరలివెళ్లాయి డోలో 650 టాబెట్లు.. అయితే, డోలోను తయారు చేసిన మైక్రో ల్యాబ్స్ పై…
పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. తాజాగా ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును కేంద్రం పొడిగించింది. ఈ గడువును మార్చి 15 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ గడువు డిసెంబర్ 31 వరకు ఉంది. కాగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును పొడిగించినట్లు కేంద్రం తెలిపింది. Read Also: ఐపీఎల్ స్పాన్సర్‌గా చైనా కంపెనీ అవుట్… ఇకపై ‘టాటా’ ఐపీఎల్…
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దామో జిల్లాలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే… శంకర్‌రాయ్ అనే వ్యక్తి ఇంట్లో లెక్కలేని డబ్బు ఉందంటూ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఇంకమ్‌ట్యాక్స్ అధికారులు శంకర్‌రాయ్ నివాసంలో సోదాలు నిర్వహించగా రూ.కోటి విలువైన నోట్ల కట్టలను సంపులో దాచినట్టు తెలుసుకుని అవాక్కయ్యారు. సంపులో దాచిన ఆ నోట్ల కట్టల బ్యాగును బయటకు తీసిన అధికారులు.. తడిసిపోయిన నోట్లను డ్రయ్యర్ తో ఆరబెట్టారు. ఇస్త్రీ…
ఆదాయం పన్ను నుంచి తప్పించుకునేందు కొంతమంది తప్పుడు దారులను అన్వేషిస్తున్నారు. తీరా అధికారుల సోదాల అసలు విషయం బయట పడడంతో జైలు పాలవుతున్నారు. అలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. యూపీ సమాజ్‌వాదీ పార్టీ నేత, వ్యాపారి పీయూష్ జైన్ తన వ్యాపారంలో వచ్చిన ఆదాయంపై పన్ను ఎగ్గొట్టేందుకు నకిలీ ఇన్‌వాయిస్‌లు, ఈ-వే బిల్లులు సృష్టించాడు. అంతేకాకుండా వాటిని ఉపయోగించి అధికారులను బురిడి కూడా కొట్టించారు. ఆ తరువాత అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు చేయగా…
హెటిరో డ్రగ్స్ ఐటీ సోదాల్లో భారీగా నగదు బయటపడింది.. ఇవాళ హెటిరో డ్రగ్స్ సీఈవో, డైరెక్టర్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.. తొలిరోజు సోదాలు ముగిసిన తర్వాత సీఈవో, డైరెక్టర్ ఇళ్లతో పాటు కార్పొరేట్ ఆఫీస్‌లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.. దాదాపు రూ. 100 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుండగా.. ఎంత నగదు అనేదానిపై ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.. అయితే, సోదాలు పూర్తిస్థాయిలో ముగిసిన తర్వాత నగదు ఎంత…