ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఉదంతం మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో వెలుగు చూసింది. కదులుతున్న రైలు నుంచి దూకి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. రైలు నుంచి దూకిన తర్వాత యువకుడి మృతదేహం పిల్లర్‌లో ఇరుక్కుపోగా, బాలిక మృతదేహం నదిలో తేలింది. విషయం వెలుగులోకి రావడంతో ఛతర్‌పూర్ పోలీసులు విచారణ ప్రారంభించారు.