రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో.. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా ముధోల్ 13.28 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. వరంగల్ జిల్లా నెక్కొండలో 12.75, భద్రాది కొత్తగూడెం జిల్లా మండలపల్లిలో 12.28, జగిత్యాల జిల్లా కొల్వాయిలో 11.90, మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 11.13 వర్షపాతం నమోదైంది. జయశంకర్ జిల్లా…
ఇప్పటికే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షా లకు జనజీవనం అస్తవ్యస్తం అయింది. తాజాగా వాతవారణ శాఖ తెలంగాణకు సైతం వర్షం ముప్పు ఉందని పేర్కొంది. తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షా లు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కిందిస్థాయి నుంచి వీస్తున్న గాలులు తూర్పు దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్నాయని, అలాగే బంగాళ ఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. ఈనెల…