Gulf Stream: భూమిపైన వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. కాలుష్యం పెరగడంతో రుతువుల్లో మార్పులు, హిమానీనదాలు వేగం కరిగిపోతున్నాయి. తాజాగా ఓ అధ్యయనం ప్రకారం, ఇదే పరిస్థితులు కొనసాగితే 2025 నాటికి భూమి వాతావరణానికి కీలకమైన ‘‘ గల్ఫ్ స్ట్రీమ్’’ నాశనమవుతుందని, దీని వల్ల రానున్న కాలంలో ‘‘మినీ ఐజ్ ఏజ్’’ ఏర్పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
రష్యా, ఉక్రెయిన్ వార్, నాటో- రష్యాల మధ్య ఘర్షణ, చైనా-తైవాన్ ఘర్షణల నేపథ్యంలో ప్రపంచంలో న్యూక్లియర్ వార్ భయాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ తో యుద్ధ సమయంలో రష్యా నాయకులు అణుయుద్ధం పేరుతో బెదిరింపులకు దిగారు. తమపై నాటో దాడికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అణు యుద్ధం జరిగితే ఎలాంటి పరిణామాలు ఏర్పడుతాయని లూసియానా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు మల్లీపుల్ కంప్యూటర్ సిమ్యులేషన్స్ సహకారంతో అధ్యయనం చేశారు. అణు…