Hyderabad: హైదరాబాద్ పరిధిలో చైనా మంజా విక్రయాలపై పోలీసులు దాడులు చేపట్టారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన పోలీసులు, విక్రయానికి సిద్ధంగా ఉంచిన దాదాపు రెండు కోట్ల రూపాయల విలువైన చైనా మంజాను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా చైనా మంజా వినియోగం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై ఫిర్యాదులు పెరగడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి ప్రత్యేక దృష్టి సారించి ఈ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర…