హైదరాబాద్‌లోని లులు మాల్ వేదికగా జరిగిన ‘ది రాజా సాబ్’ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రభాస్ వంటి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న హీరో సినిమా కార్యక్రమం కావడం వల్ల దేశవ్యాప్తంగా దీనిపై ఆసక్తి నెలకొంది. అయితే, ఈ వేడుక ముగిసిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాక, జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. కార్యక్రమం ముగించుకుని హీరోయిన్ నిధి అగర్వాల్ తన కారు వైపు వెళ్తున్న సమయంలో,…