Home
Hyderabad Drugs Case
Hyderabad Drugs Case News
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
గోవా నుంచి హైదరాబాద్‌కు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌ను పోలీసులు భగ్నం చేశారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ‘ఈగల్ ఫోర్స్’ (EAGLE Force), హైదరాబాద్ సిటీ పోలీసులు బోయింగ్ పంజాగుట్ట పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ప్రతిష్టాత్మక ఆపరేషన్‌లో గోవాకు చెందిన ప్రధాన డ్రగ్ పెడ్లర్ క్రిస్టీ (కస్టోడియో ఫెర్నాండెజ్) పోలీసులకు చిక్కాడు. గోవాలో అజ్ఞాతంలో ఉన్న నిందితుడిని స్థానిక పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పంజాగుట్టలో ఇటీవల అరెస్టయిన నిందితుడు… -
Taramati Drug Case: తారామతి బారాదరిలో డ్రగ్స్ పార్టీ రట్టు.. బాలీవుడ్ నటుడు సర్వర్ అరెస్ట్..
సిటీ శివార్లలోని రిసార్టులు మరోసారి మాదకద్రవ్యాల వేదికగా మారుతున్నాయి. గండిపేట్ సమీపంలోని చారిత్రాత్మక తారామతి బారాదరి రిసార్ట్ వేదికగా జరిగిన ఒక ప్రైవేట్ డ్రగ్స్ పార్టీని పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనలో బాలీవుడ్ నటుడు సర్వర్ సహా పలువురు ప్రముఖులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం సృష్టించింది. Train Coach: పెళ్లి కోసం ఏకంగా రైలు కోచ్ మొత్తాన్ని బుక్ చేసుకున్న కుటుంబం.. ఇలా బుక్ చేసుకునే వీలుందా? విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఒక ప్రైవేట్… -
Moinabad Farmhouse Drug Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక సమాచారం సేకరించిన సిట్
మొయినాబాద్ ఫార్మ్‌హౌస్ డ్రగ్స్ కేసులో ప్రత్యేక విచారణ బృందం (SIT) దర్యాప్తును ముమ్మరం చేస్తూ కీలక సమాచారాన్ని సేకరించింది. ఈ కేసులో భాగంగా ముగ్గురు నిందితులను మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న అధికారులు, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్ పెడ్లర్లతో ఉన్న సంబంధాలపై లోతుగా విచారణ జరిపారు. ముఖ్యంగా రోహిత్ రెడ్డి గత ఐదు నెలల కాలంలోనే సుమారు 10 సార్లు దుబాయ్ వెళ్లినట్లు సిట్ గుర్తించింది, ఈ క్రమంలో అక్కడ జరిగిన… -
Moinabad Drugs Case: అభిషేక్ దొరికితే చిక్కుముడి వీడినట్లేనా? ఫ్రెండ్స్‌తో ఏం చేస్తున్నాడు?
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్, కాల్పుల కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, నమిత్‌శర్మను కస్టడీలోకి తీసుకుంది సిట్. మరోవైపు డ్రగ్స్‌ను సరఫరా చేసిన అభిషక్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
Moinabad Farmhouse Drugs Case: టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కు బెయిల్..
హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన టీడీపి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్‌తో పాటు ప్రియాంక రెడ్డి అనే మహిళకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు సమాచారం. అయితే, మార్చి 16 (సోమవారం)… -
Breaking News: మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో కాల్పుల కలకలం.. పోలీసులపై డ్రగ్స్ బ్యాచ్ దాడి.!
హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఒక మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు జరిపిన మెరుపు దాడులు సంచలనానికి దారితీశాయి. కేవలం డ్రగ్స్ సేవించడమే కాకుండా, పార్టీలో గాలిలోకి కాల్పులు జరపడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. మొయినాబాద్‌లోని ఒక ఫామ్ హౌస్‌లో భారీగా డ్రగ్స్ పార్టీ జరుగుతోందని ఈగల్ టీమ్‌కు ముందస్తు సమాచారం అందింది. దీంతో అధికారులు సోదాలకు వెళ్లగా, అక్కడ ఉన్న యువకులు పోలీసులను… -
Drugs :పంజాగుట్టలోని కాలేజీలో డ్రగ్స్ కలకలం..
హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ మహమ్మారి నీడలా వెంటాడుతూనే ఉంది. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా, విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ ముఠాలు తమ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నాయి. తాజాగా పంజాగుట్టలోని ఒక ప్రముఖ కాలేజీలో వెలుగుచూసిన డ్రగ్స్ ఉదంతం నగరవాసులను విస్తుపోయేలా చేస్తోంది. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన కాలేజీ ప్రాంగణమే మత్తు పదార్థాల వినియోగానికి వేదికగా మారడం గమనార్హం. పంజాగుట్ట పరిధిలోని నాగార్జున సర్కిల్ సమీపంలో ఉన్న ఒక ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు కొందరు అనుమానాస్పదంగా తిరుగుతుండటం… -
Hyderabad: పంజాగుట్ట కాలేజీలో డ్రగ్స్ కలకలం.. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఐదుగురు విద్యార్థులు..
Hyderabad: హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ కాలేజీకి చెందిన విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కడం కలకలం రేపింది. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ పరిధిలో ఐదుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు10 గ్రాముల ఎండీఎంఏ (MDMA) డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నాగార్జున సర్కిల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురు యువకులను గమనించిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వారు డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు గుర్తించారు. -
Rakul Preet Brother: టాలీవుడ్లో ప్రకంపనలు.. డ్రగ్స్ కేసులో మళ్ళీ ఇరుక్కున్న రకుల్ ప్రీత్ సోదరుడు
హైదరాబాద్ నగరాన్ని మరోసారి డ్రగ్స్ కలకలం వణికిస్తోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారే ఎక్కువగా ఈ కేసుల్లో చిక్కుకోవడం సంచలనం రేపుతోంది. మాసబ్‌ట్యాంక్ పరిధిలో వెలుగుచూసిన తాజా డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి పేరు తెరపైకి రావడం కేవలం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్ రహిత తెలంగాణా కోసం పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా, విదేశీ డ్రగ్స్ మూలాలు మాత్రం ఏదో ఒక రూపంలో వెలుగుచూస్తూనే… -
Hyderabad: అమీర్‌పేట్‌లోని ఆ హాస్పటల్లో డ్రగ్స్ కలకలం..
Hyderabad: హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని ప్రిస్టిన్ కేర్ zoi హాస్పిటలో డ్రగ్‌లో డ్రగ్స్ కలకలం సృష్టించింది. ఈ ఆసుపత్రిలో ఓ పాత నేరస్థుడు ఆసిఫ్ డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. 2024లో ఆసిఫ్‌ను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.గత ఏడాది అక్టోబర్‌లో ముంబై నుంచి mdma డ్రగ్‌ను తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తుండగా పట్టుకున్నారు. 2025 మేలో బెయిల్ పైన బయటకు వచ్చాడు నేరస్థుడు ఆసిఫ్.. ఈజీ మనీకి అలవాటు పడి, డ్రగ్స్ విక్రయించడం ప్రారంభించాడు. తాజాగా అమీర్‌పేట్‌లోని ప్రిస్టిన్ కేర్…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..