తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక సాక్షిగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కురుక్షేత్రాన్ని తలపించేలా పోటీపడుతున్నారు. ఎవరికీ వారు తగ్గెదేలా అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో హుజూరాబాద్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రచారంలో దూసుకెళుతుండగా కాంగ్రెస్ మాత్రం కొంచెం వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రధాన పార్టీలు చేస్తున్న ప్రచారంపై స్థానిక ఓటర్లు మాత్రం పెదవి విరుస్తున్నారనే టాక్ విన్పిస్తోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్…