కాలంతో పాటు ఎన్నికల ప్రచారం తీరు కూడా మారింది. ఒకప్పుడు నాయకుడు ఊళ్లోకి వస్తున్నాడంటే జనం ఆయనను చూడటానికి స్వచ్ఛందంగా వెళ్లేవారు. పనులు మానుకుని ఆయన రాకకోసం ఎదురుచూసేవారు. చెప్పింది శ్రద్ధగా వినేవారు. నాడు నాయకుల మాటల్లో ..హావ బావాలలో హూందాతనం ఉట్టిపడేది. ప్రజలతో మమేకమయ్యేవారు. ప్రత్యర్థులను విమర్శించాల్సి వస్తే సహేతుక ..సంస్కారవంతమైన భాష ఉపయోగించేవారు. కానీ నేడు ..నాయకుల తీరు చూస్తున్నాం.. నోరు తెరిస్తే బూతులు. అబద్దాలు. మర్యాద అన్నది మచ్చుకు కూడా కనిపించదు. నాడు…