దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల 26/11 తరహా దాడి చేస్తామని ముంబై ట్రాఫిక్ కంట్రోల్ వాట్సాప్ నంబర్‌కు పాకిస్థాన్ నుంచి మెసేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి బెదిరింపులు వచ్చాయి. రూ.5 కోట్లు ఇవ్వకుంటే హోటల్‌ను పేల్చేస్తామని అగంతుకులు ఫోన్ కాల్స్ చేశారు.