ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యత, మార్కెటింగ్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహంచారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సీఎస్ కె. విజయానంద్, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.. ఎరువుల లభ్యత, సరఫరా, పక్కదారి పట్టకుండా తీసుకుంటున్న చర్యలపై ఈ సమీక్షలో చర్చించారు..