నాని హీరోగా ఈ ఏడాది హిట్ 3 అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ సినిమా రిలీజ్‌కి 18 గంటల ముందు ఐ-బొమ్మలో ఒరిజినల్ క్వాలిటీతో రిలీజ్ అయింది. ఈ నేపధ్యంలో ప్రొడక్షన్ హౌస్ అయితే కచ్చితంగా ఇది ప్రొడక్షన్ హౌస్‌లో ఎవరో చేసిన పని అని భావించి, తమ సొంత ఉద్యోగులను అనుమానించి పోలీస్ కేసులను సైతం నమోదు చేయించి దర్యాప్తు చేయించింది. అయితే అప్పట్లో…