కొడితే.. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి.. లైఫ్ సెటిల్ ఐపోతుందని ప్రతీ నిరుద్యోగి కల. భాష కారణంగా కలను నిజం చేసుకోలేకపోతున్నారు నిరుద్యోగులు. పోటీ పరీక్షలన్నీ హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉంటున్నాయి. తెలుగు, తమిల్, మళయాలం, కన్నడ వంటి ప్రాంతీయ భాషల్లోనే విద్యాభ్యాసం చేసిన అభ్యర్థులకు పరీక్షలను ఎదుర్కోలేకపోతున్నారు. ఇంగ్లీష్, హిందీ మాదిరిగానే… ప్రాంతీయ భాషల్లో కూడా పరీక్షలను నిర్వహించాలని మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ను కోరారు. ఆంగ్లేతర మాధ్యమంలో చదివిన వారు, హిందీయేతర రాష్ట్రాల…