Glacial Lakes: హిమాలయాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. భారతదేశంలోని హిమాలయ ప్రాంతాల్లోని 400కు పైగా హిమనదీయ సరస్సులు(గ్లేసియర్ లేక్స్) విస్తరిస్తున్నట్లు తాజా రిపోర్టులో వెల్లడించింది. ఎప్పుడైనా ప్రమాదం ముంచుకురావొచ్చని సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) తన తాజా పర్యవేక్షణ నివేదికలో వెల్లడించింది. జూన్ 2025కి గ్లేసియర్ సరస్సులు, నీటి వనరుల నెలవారీ పర్యవేక్షణ నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
హిమాచల్‌ప్రదేశ్‌ను ఆకస్మిక వరదలు హడలెత్తించాయి. దీంతో మండి జిల్లాలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇప్పటి వరకు 91 మంది చనిపోయారు. ఇక కొండచరియలు విరిగిపడడంతో గ్రామాలకు గ్రామాలే దెబ్బతిన్నాయి.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో కులులో బుధవారం మూడు ‘‘క్లౌడ్ బరస్ట్’’ చోటు చేసుకున్నాయి. దీంతో ఒక్కసారిగా మెరుపు వరదలు ఆ ప్రాంతాలను ముంచెత్తాయి. కీలక రహదారులు ఎక్కడికక్కడ స్తంభించి పోయాయి. సైన్జ్, గడ్సా, సోలాంగ్ నాలాలో కుండపోత వర్షాలు నమోదయ్యాయి. దీంతో జీవ నాలా ప్రవాహం అకస్మాత్తుగా పెరిగింది. స్థానిక ప్రజల్ని అధికారులు హెచ్చరించారు. ఆకస్మిక వరద కారణంగా నదులు మరియు వాగులు ఉప్పొంగి ప్రవహించాయి.
Cloudburst: భారీ వర్షాలు,కొండచరియలు విరిగిపడడంతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందులతో పోరాడుతోంది. కిన్నౌర్‌లో మేఘాల విస్ఫోటనం(క్లౌడ్ బరస్ట్) కారణంగా నీటి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది.
Himachal Pradesh: ఈసారి వర్షాలు హిమాచల్ ప్రదేశ్‌లో గరిష్ట విధ్వంసం కలిగిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. మండి జిల్లాలో చాలా చోట్ల వంతెనలు, రోడ్లు కొట్టుకుపోయాయి.