Hitech Coping : సాంకేతికత ఎంతగా పెరుగుతుందో, నేరగాళ్లు దాన్ని అంతగా దుర్వినియోగం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) నిర్వహించిన నాన్-టీచింగ్ ఉద్యోగాల నియామక పరీక్షలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) సాయంతో కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు యువకులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. హర్యానా రాష్ట్రానికి చెందిన అనీల్ మరియు సతీష్ అనే నిందితులు అత్యంత ఖరీదైన, అధునాతన పరికరాలను ఉపయోగించి పరీక్ష రాస్తూ అధికారులకు చిక్కారు. ఈ ఘటన విద్యా మరియు పోలీస్…