చిత్రసీమను నమ్ముకుంటే, ఏదో ఒక రోజున కోరుకున్నది లభిస్తుందని కొందరి విశ్వాసం. అలా సినిమా రంగంలో కోరుకున్న తీరాలు చేరిన వారు ఎందరో ఉన్నారు. వారి స్ఫూర్తితోనే సాగుతున్నారు యంగ్ హీరో సందీప్ కిషన్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తన దరికి చేరిన పాత్రలు పోషించి, ఇప్పటికి దాదాపు ఇరవైకి పైగా సినిమాల్లో నటించేశారు సందీప్ కిషన్.