(అక్టోబర్ 16న హేమామాలిని పుట్టినరోజు)అందాలతార హేమా మాలినిని చూడగానే ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ అనిపిస్తుంది. ‘హరివిల్లు దివినుండి దిగివచ్చినట్టూ’ భావిస్తాము. అసలు బ్రహ్మ ప్రత్యేక సృష్టి అని కూడా అనిపించక మానదు. ‘అందానికి అందం’ అన్న ఉపమానం అన్నివిధాల సరితూగే రూపం హేమా మాలిని సొంతం. ఆ నాటి నుండి ఈ నాటికీ ఎంతోమంది రసికుల స్వప్నసుందరిగా రాజ్యమేలుతూనే ఉన్నారు హేమామాలిని. ఏడు పదులు దాటినా అందమంటే ఆమెదే అనే రీతిన హేమామాలిని సాగుతూ ఉండడం…