ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతుండటంతో జలాశయాలకు వరద పోటెత్తుతోంది. ఏపీలోని పులిచింతలకు 11 వేల 548 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 33.8 టీఎంసీల వద్ద ఉంది. కర్నూల్ జిల్లా హోస్పేటలో ఇవాళ తుంగభద్ర నది గేట్లు ఎత్తనున్నారు. ఈ జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో 87 వేల 305 క్యూసెక్కులు కాగా…