(ఆగస్టు 1న తాప్సీ పన్ను పుట్టినరోజు)తెలుగు చిత్రం ‘ఝుమ్మంది నాదం’తోనే వెండితెరపై తొలిసారి వెలిగింది తాప్సీ పన్ను. తరువాత మరికొన్ని తెలుగు చిత్రాల్లో నటించినా, ఉత్తరాదికి వెళ్ళాకనే ఆమెకు నటిగా మంచి గుర్తింపు లభించింది. దక్షిణాది చిత్రాలలో గ్లామర్ నే ఎక్కువగా ఆరాధిస్తారని అప్పట్లో కామెంట్ చేసి, తరువాత నాలుక్కరచుకుంది. ఏమైనా ప్రస్తుతం తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న తాప్సీ బాలీవుడ్ లో భలేగా సాగుతోంది. ప్రస్తుతం ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే తెలుగు చిత్రంలో తాప్సీ నటిస్తోంది.…