తెలుగు చిత్రసీమలో నవలానాయకుడు అన్న పేరుతో మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు సుప్రసిద్ధులు. ఆయన తరువాత ఆ స్థాయిలో నవలాచిత్రాలతో విజయం సాధించింది చిరంజీవి అనే చెప్పాలి. అక్కినేని లవ్ స్టోరీస్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ తో రూపొందిన నవలల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలలో నటించారు. అయితే చిరంజీవి కోసమే అన్నట్టుగా కొన్ని నవలలు యాక్షన్ ను కూడా జోడించాయి. సదరు నవలల ద్వారా చిరంజీవి నటునిగా మంచిపేరు సంపాదించారు. చివరకు మెగాస్టార్ గా జనం మదిలో నిలిచారు. ఆయన…