కవితకు కాదేది అనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఒకప్పుడు కవిత చెప్పాలి అనే, పద్యం రాయాలి అంటే తెలుగు వ్యాకరణం ఆమూలాగ్రం తెలిసి ఉండాలి. సంస్కృతంపై మంచి పట్టు ఉండాలి. పండితుల భాషలో చెప్పగలగాలి. శ్రీశ్రీ వచ్చిన తరువాత కవితకు అర్ధం మార్చేశారు. అలతి పదాలతో అనర్గళమైన అర్ధాన్ని ఇచ్చే విధంగా కవితలు రాశారు. పదునైన పదాలతో సూటిగా ప్రశ్నించాడు. వస్తే రాని పొతే పోనీ అని అంటూ అప్పటికి ఇప్పటికి ఎప్పటికి వచ్చే కష్టాలను, సుఖాలను పట్టించుకోవద్దని చెప్పాడు. 18 ఏళ్ల…