Pakistan: ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తున్న దేశంగా ఇప్పటికే పేరు తెచ్చుకున్న పాకిస్థాన్‌లో తాజాగా మరో ఆందోళనకర పరిణామం వెలుగులోకి వచ్చింది. హమాస్, లష్కరే తోయిబా ఉగ్రవాద నేతలు ఒకే వేదికగా సమావేశమైన విషయం బట్టబయలైంది. ఈ ఘటన పాకిస్థాన్‌లోని గుజ్రాన్‌వాలాలో జరిగింది. అక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో హమాస్ సీనియర్ కమాండర్ నాజీ జహీర్, లష్కరే తోయిబా కమాండర్ రషీద్ అలీ సందూహ్‌తో కలిసి పాల్గొన్నాడు. ఈ కార్యక్రమాన్ని పాకిస్థాన్ మార్కజీ ముస్లిం లీగ్ నిర్వహించింది.…