ఆర్థిక మాంద్యం దెబ్బతో దిగ్గజ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ సహా చాలా కంపెనీలు లేఆఫ్స్ విధించాయి. తాజాగా దిగ్గజ అమెజాన్ మరోసారి లేఆఫ్స్ ప్రకటించింది. అమెజాన్ తన ఆరోగ్య-కేంద్రీకృత హాలో విభాగాన్ని మూసివేసింది. దాని వెబ్‌సైట్‌లో ఇకపై అందుబాటులో లేని హాలో బ్యాండ్, హాలో వ్యూ, హాలో రైజ్ పరికరాలను నిలిపివేసింది.