రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న దాదాపు 112 మంది వైద్యులపై వేటు వేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. నెలలుగా డుమ్మా కొడుతున్న వైద్యుల లిస్ట్‌ను తెలంగాణ ఆరోగ్య శాఖ సిద్ధం చేసింది. ఉద్యోగాల్లో ఉండి.. కాలేజీలకు రాకుండా, విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా ఉన్న డాక్టర్లను విధుల నుంచి తొలిగించాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. వైద్యుల గైర్హాజరు కారణంగా అటు వైద్యవిద్యార్థులకు తరగతులు జరగకపోగా.. ఇటు అనుబంధ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు…