మణిపూర్ కాంగ్రెస్ కు మరోషాక్ తగిలింది. ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేస్తున్న బీజేపీ ధాటికి కాంగ్రెస్ పార్టీ కుదేలవుతున్నది. వచ్చే ఏడాది అనేక రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలా ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో మణిపూర్ కూడా ఒకటి. మణిపూర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షపదవికి గోవిందాస్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గోవిందాస్‌తో పాటుగా మరో 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారు. ఈశాన్యరాష్ట్రాల్లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ క్రమంగా మసకబారుతున్నది.…