ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రులు కొలువుదీరబోతున్నారు.. ఇవాళ ఉదయం 11.31 గంటలకు మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించనున్నరు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్… దీనికోసం తాత్కాలిక సచివాలయం మొదటి బ్లాకు పక్కన ప్రత్యేకంగా వేదికను సిద్ధం చేశారు. ఇప్పటికే నూతనంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న శాసన సభ్యుల జాబితాకు గవర్నర్ ఆమోదం తెలిపారు.. వెలగపూడిలోని సచివాలయం ఆవరణలో మంత్రివర్గంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది.. తిరిగి ప్రమాణ స్వీకారం చేయనున్నారు 11 మంది పాత మంత్రులు.. మొత్తం 25 మందితో…
ఆంధ్రప్రదేశ్‌లో నూతన శకం ఆరంభం.. కొత్తగా 13 జిల్లాలతో మొత్తం 26 జిల్లాల్లో పాలన ప్రారంభించారు.. కొత్త జిల్లాలను సీఎం వైఎస్ జగన్.. క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ బటన్ నొక్కి కొత్త జిల్లాలు అమలులోకి వచ్చినట్టు వెల్లడించారు సీఎం వైఎస్ జగన్.. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా పాలనను ప్రజల చెంతకు మరింత దగ్గరగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.. ఇక, కొత్త జిల్లాల ఏర్పాటును ఆహ్వానించారు…