శ్రీలంక ప్రజా ఉద్యమంతో అట్టుడుకుతోంది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని శనివారం పెద్ద ఎత్తున రాజధాని కొలంబోలో ప్రజలు ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రజా ఉద్యమంతో అధ్యక్షభవనం నుంచి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పారిపోయారు. అధ్యక్ష భవనాన్ని, ఆయన కార్యాలయాన్ని ఆందోళకారులు ఆక్రమించారు. గొటబాయ రాజీనామా చేసేవరకు అధ్యక్ష భవనాన్ని విడిచి వెళ్తేది లేదంటూ వేలాదిగా నిరసనకారులు అక్కడే మకాం వేశారు. ఇదిలా ఉంటే శ్రీలంక అధ్యక్షుడు…