తూర్పుగోదావరి జిల్లా : రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి ఆసక్తి కర కామెంట్స్ చేశారు… వైసీపీ నేతలు సంక్షేమ పథకాల లబ్దిదార్లను ఓట్ల కోసం భయపెట్టారని…. అందుకే పరిషత్ ఎన్నికలను టి.డి.పి బాయ్ కాట్ చేసిందని తెలిపారు. రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు వెంటనే నిర్వహిస్తే టి.డి.పి బలమేంటో చూపిస్తామని… వై.సి.పి ప్రభుత్వ తీరు పై ప్రజా ఉద్యమాల ద్వారా బయటకి వస్తామని వెల్లడించారు. ఎం.పి.పి. స్థానాలకు అవకాశం ఉన్నచోట్ల జనసేనతో సర్దుబాటు చేసుకుంటామని…