సికింద్రాబాద్‌లోని రేతిఫైల్ బస్టాప్‌లో రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయి ప్రాణాలు వదిలాడు ఓ ప్రయాణికుడు.. బస్సు వెనకాల నుంచి వెళ్తున్న దుర్గా ప్రసాద్ అనే వ్యక్తిని వెనుక నుంచి మరో బస్సు ఢీ కొట్టింది. దీంతో రెండు బస్సుల మధ్య తీవ్ర గాయాలతో ఉండిపోయాడు. కదల్లేక.. బయటికి రాలేక కాపాడాలని వేడుకున్నాడు. కానీ, అరగంట పాటు ఎవరూ స్పందించలేదు. అయితే, అంబులెన్స్ అక్కడికి చేరుకునే సమయంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రాణాపాయ స్థితిలో కాపాడాలంటూ వేడుకున్నా.. జనం పట్టించుకోలేదు.…