రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంవహిస్తూ, నటించిన చిత్రం ముని. 2007లో విడుదలైన ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. దానికి కొనసాగింపుగా 2011లో కాంచన చిత్రాన్ని తీసుకువచ్చాడు లారెన్స్. కాంచన అటు తమిళంతో పాటు తెలుగులోను వి ఘన విజయం సాధించింది. ముఖ్యంగా అర్థనారీశ్వరి పాత్రలో శరత్ కుమార్, లారెన్స్ నటనకు కాసుల వర్షం కురిసింది. ఆ సినిమాకు సిక్వెల్ గా 2015లో వచ్చిన గంగా ( కాంచన 3) కూడా సూపర్ హిట్…