మళ్ళీ గోదావరి వరద ప్రవాహం పెరుగుతుంది. కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన వరద మళ్ళీ పెరుగుతుండటంతో ముంపు గ్రామాల నిర్వాసితుల్లో ఆందోళన నెలకొంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు కారణంగా గోదావరి వరద ఉగ్రరూపం దాల్చుతోంది. నిన్న (శుక్రవారం) ఉదయం నుంచి రాత్రి వరకు భాగ్యనగరంతో సహా పలు జిల్లాల్లో భారీగా వానలు పడ్డాయి. నగరవాసులతంగా ఇంకా ఐదురోజుల పాటు అప్రమత్తంగా వుండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్రేటర్ నగరంతో పాటు మహబూబ్ నగర్, జనగామ,…