తిరుచానూరు శిల్పారామంలో ప్రమాదం జరిగింది. శిల్పారామం క్యాంటీన్ వద్ద గల ఫన్ రైడ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. జెయింట్ వీల్‌లో తిరుగుతూ 20 అడుగుల ఎత్తు నుండి ఇద్దరు మహిళలు కింద పడిపోయారు. ఈ క్రమంలో.. ఓ మహిళా అక్కడికక్కడే మృతి చెందింది. మరో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి.