Pakistan: ఈజిప్ట్ ‘‘షర్మ్ ఎల్ షేక్’’లో గాజా శాంతి ఒప్పందంపై ఇజ్రాయిల్, హమాస్ సంతకాలు చేశాయి. దీనికి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు పలు దేశాధినేతలు హాజరయ్యారు. అయితే అన్నింటి కన్నా ఎక్కువగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ట్రంప్‌ను పొగుడుతున్న వీడియో తెగ వైరల్ అయింది. అమెరికా అధ్యక్షుడిని ‘‘శాంతి దూత’’ అని షరీఫ్ ప్రశంసించారు. భారత్-పాకిస్తాన్ యుద్ధం ఆపినందుకు ట్రంప్‌కు పాకిస్తాన్ ప్రధాని థాంక్స్ తెలిపారు.