Israeli Strikes: గాజాలో ఇజ్రాయిల్ దాడుల్ని తీవ్రతరం చేసింది. శనివారం గాజా స్ట్రిప్‌పై జరిగిన దాడుల్లో 48 మంది మరణించినట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు. పోలియో వ్యాక్సిన్ ప్రచారాన్ని ప్రారంభించే ముందు గాజాలోని మధ్య, దక్షిణ ప్రాంతాల్లో ఈ ఘర్షణలు జరిగాయి. ఐక్యరాజ్యసమితి దాదాపుగా 6,40,000 మంది పిల్లలకు పోలియో టీకాలు వేయడం ప్రారంభించనుంది.