Gujarat : పెళ్లయ్యాక ఆ అమ్మాయి నమ్మకంతో భర్త ఇంటికి వస్తుంది. ఆమె తన భర్తపై ఎలాంటి ప్రేమను చూపిస్తోందో అలానే తన భర్త నుంచి ఆశిస్తుంది. పెద్దలు కుదిర్చిన వివాహం కంటే ప్రేమ పెళ్లిలో వీరి మధ్య నమ్మకం మరీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆమెకు భాగస్వామి గురించి ముందే తెలుసు.
Chikoti praveen: ఇప్పట్లో క్యాసినో నిర్వహించే ఆలోచన లేదని, ఈడీ విచారణకు ఎప్పుడూ పిలిచినా వస్తానని వెళ్తానని చీకోటి ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. నిన్న ఈడీ అధికారులు చీకోటి ప్రవీణ్ కుమార్ ను ఏడు గంటల పాటు విచారించారు.
Telugu Desam Party: ఏపీ సీఎం జగన్‌కు రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బహిరంగలేఖ రాశారు. వైసీపీ నేతల ఆధ్వర్యంలో కృష్ణా నదీ తీరంలోని దిబ్బలు, ద్వీపాల్లో యధేచ్ఛగా జూద కేంద్రాలు నడుస్తున్నాయని ఎమ్మెల్యే అనగాని తన లేఖలో ప్రస్తావించారు. జూద కేంద్రాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదని గుర్తుచేశారు. రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నంలో వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యులు పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.…
సంక్రాంతి వచ్చిందంటే ఉభయ గోదావరి జిల్లాల్లో కోళ్లు కాళ్లు దువ్వుతాయ్. ఇది కొందరికి సంప్రదాయం. మరికొందరికి పండుగ పూట వినోదం.. ఇంకొందరికి దండిగా ఆదాయం సమకూరే మార్గం. ఆనవాయితీ ముసుగులో ఇదే వేదికగా ఇతర జూదాలకు దిగుతున్నారు.ఏటా సంక్రాంతికి కోట్లలో చేతులు మారుతుండడం రివాజుగా మారుతోంది. అడ్డుకుంటామని పోలీసులు అంటుంటే..ఆడించి తీరుతామని నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు. సవాళ్లు..ప్రతి సవాళ్ల మధ్య రెండు జిల్లాల్లో సంక్రాంతి కోడి పందాలపై ఉత్కంఠ నెలకొంది. తెలుగు లోగిళ్లలో పెద్ద పండగ సంక్రాంతి.…
హైదరాబాద్ లో సంచలనం రేపుతున్న పేకాట కేసు కీలక మలుపు తిరిగింది. మంచిరేవుల పేకాట కేసులో హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. గతంలో రెండుసార్లు శివలింగ ప్రసాద్ కు నోటీసులు జారీ చేసినా ఆయన పట్టించుకోకపోయేసరికి శివలింగప్రసాద్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫామ్ హౌస్ పేకాట కేసులో ప్రధాన నిందితుడుగా గుత్తా సుమన్ పేరు వినిపిస్తున్నా ఈయనతో పాటు మరో వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు…
ఆయనో మంత్రి. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా సొంత పార్టీవర్గాలే చెవులు కొరుక్కుంటాయి. ఏదో ఒక అంశంలో మంత్రి పేరు వినిపించడం కామన్. ఈసారి తమ్ముడు చేసిన పనివల్ల చిక్కుల్లో పడ్డారు. విపక్షాలకు మళ్లీ దొరికిపోయారు. దాంతో ఆ సమస్య నుంచి బయటపడేందుకు దారులు వెతుక్కుంటున్నారట అమాత్యుల వారు. మళ్లీ చర్చల్లోకి వచ్చిన మంత్రి మల్లారెడ్డి మంత్రి చామకూర మల్లారెడ్డి. ఈ పేరు చెప్పగానే రాజకీయవర్గాల్లో అనుకోకుండానే నవ్వు వచ్చేస్తుంది. ఆయన కామెడీ టైమింగ్ అలా ఉంటుంది మరి.…