వచ్చే ఏడాది ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ క్రమంలో.. ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) భారత్ తో ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు వచ్చే ఏడాది జూన్, ఆగస్టు మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆడేందుకు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.