Madhya Pradesh: మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలోని ఓ గ్రామంలో గత కొన్ని శతాబ్ధాలుగా రాళ్లను దేవతలుగా పూజిస్తుlన్నారు. అక్కడి ప్రధాన సంప్రదాయాల్లో ఈ రాళ్లకు ప్రత్యేకస్థానం ఉంది. అయితే తాజాగా తేలింది ఏంటంటే.. అసలు ఇవి రాళ్లే కావని, డైనోసార్లకు సంబంధించిన గుడ్లుగా తేలింది. అక్కడి ప్రజలు వీటిని తమ కుటుంబ దేవతలుగా కొన్నేళ్లుగా పూజిస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.