ప్రస్తుతం ఎన్నికలు అంటేనే డబ్బు, మద్యం.. ఆపై సామాజికంగా విభజించి ఓట్లను కొనేయడమే అన్న చందంగా మారాయి. ఎన్నికల కమీషన్ ఎంత చైతన్య పరుస్తున్న మార్పు కనిపించడం లేదు. కఠినమైన చట్టాలు వున్నా శిక్ష పడట్లేదు అనేది సగటు ఓటరు ఆవేదన.. అయితే తాజాగా ఓ ఎన్నికల్లో డబ్బులు పంచిన మాజీ ఎమ్మెల్యేకు జైలు శిక్ష ఖరారు చేసింది కోర్టు..వివరాల్లోకి వెళ్తే, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు కోర్టు జైలు శిక్ష విధించింది. ఎన్నికల్లో డబ్బులు…