Eggs Prices: గతంలో రూ. 6, రూ. 7 లకు దొరికే ‘కోడిగుడ్డు’ ధర ఇప్పుడు రూ. 8కి చేరింది. అయితే, ఇలా ఎందుకు పెరుగుతున్నాయని సాధారణ వినియోగదారుడి మదిలో ఒక ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో, నగరాల్లో ఎగ్స్ రేట్లు పెరిగాయి.
చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడి గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. మార్కెట్‌లో డిమాండ్ ఒక్కసారిగా పెరగడం, ఫీడ్ ధరలు అధికమవడం, రవాణా ఖర్చులు పెరగడం వంటి కారణాలతో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ధరల పెరుగుదల సామాన్య ప్రజల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంతో పోలిస్తే కిలో చికెన్ ధర గణనీయంగా పెరగగా, కోడి గుడ్ల ధరలు కూడా డజన్‌కు మరింత భారంగా మారాయి. ధరల…