దేవుళ్ల కంటే సమాజంలో వైద్యులకే ఎక్కువ విలువ. అందులోనూ ప్రభుత్వ డాక్టర్లు అంటే.. ఆ హోదాకు ఉండే గౌరవం ఇంకా ఎక్కువ. కానీ.. వైద్య వృత్తిని వదిలేసి.. సంఘాల పేరుతో చక్కర్లు కొడుతున్నారు తెలంగాణలోని గవర్నమెంట్ డాక్టర్లు. ఎవరికి నచ్చిన రాజకీయం వాళ్లు చేస్తూ మరింత రక్తి కట్టిస్తున్నారు. విభాగ అధిపతులకు కొరకరాని కొయ్యగా ప్రభుత్వ వైద్యులు..? తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాలు కీలకపాత్ర పోషించాయి. తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల సంఘం సైతం కీలకంగా వ్యవహరించింది.…